పాలనా సంస్కరణలపై పద్మనాభరెడ్డిగారి ఇంటర్వ్యూ

September 24, 2018


img

తెలంగాణా అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజలు ఎంతగా పరితపిస్తున్నారో, అమెరికాలో స్థిరపడిన ప్రవాస తెలంగాణావాసులు కూడా అంతే పరితపిస్తుంటారు. రాష్ట్రంలో వారు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే ప్రతీవారం ‘డయల్ యువర్ విలేజ్’ పేరిట అమెరికా నుంచి నేరుగా తెలంగాణాలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు గల అధికారులు, ప్రముఖులు, మేధావులు, సామాన్య ప్రజలతో మాట్లాడుతూ వివిద అంశాలపై, స్థానిక సమస్యలపై చర్చించి యధాశక్తిన ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారు. 



రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగబోతున్నందున వారు బుధవారం రాత్రి పరిపాలన సంస్కరణలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ కార్యదర్శి శ్రీ పద్మనాభరెడ్డిగారితో మాట్లాడారు. వారి చర్చ గురించి స్థలాభావం కారణంగా ఇక్కడ పూర్తిగా వివరించడం కష్టం కనుక క్లుప్తంగా పేర్కొంటున్నాము. ఈ క్రింది లింకులో వారి సంభాషణ నేరుగా విన్నట్లయితే అది ఎంత అర్ధవంతంగా, లోతుగా సాగిందో గ్రహించవచ్చు.  

https://fccdl.in/38u0qaW4Mh   

ఈ చర్చపై  మీ అభిప్రాయాలు తెలియజేయడానికి క్రింది సర్వేలో పాల్గొనండి.

https://goo.gl/forms/V0mSsxUd8reYu9ft2  

బుధవారం రాత్రి జరిగిన ఈ చర్చలో ముఖ్యాంశాలు:   

1. సమాచార హక్కు చట్టం: సమాచార హక్కు చట్టం మరింత సరళతరం చేసి, ప్రజలకు సమాచారం సులువుగా అందే ప్రయత్నం చేయాలి.

2. పౌరహక్కులు: లోక్ సభలో సిటిజన్స్ రైట్ ఫర్ సర్వీసస్’ అనే బిల్లు ఇంకా పెండింగులో ఉంది. దానిని అమలుచేయాలి. బిల్లు లోని అంశాలను తీసుకొని తెలంగాణా రాష్ట్రంలో అమలు చేయాలి. ఈ చట్టం ద్వారా నిర్ణీత సమయంలో ప్రభుత్వ సేవలను పొందే హక్కు పౌరులకు ఉంటుంది. దీనివల్ల ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగడం, లంచాలివ్వడం తగ్గుతుంది. అలాగే పరిపాలన వ్యవస్థలో సామర్థ్యం పెరుగుతుంది. నిర్ణీత సమయంలో చేయకపోతే ఎందుకు చేయలేదో జవాబుదారీ తనం ఉంటుంది. ఇప్పటికే ఇది అమలుచేస్తున్న రాష్ట్రాల వివరాలు ఈ క్రింది లింకులో చూడవచ్చు.

https://en.wikipedia.org/wiki/Right_to_Public_Services_legislation 

3. రాజకీయ సంస్కరణలు: ఎన్నికలో పోటీచేస్తున్న అభ్యర్థులపై ఉన్న కేసులను సత్వరంగా పరిష్కరించి, ప్రజలకు కేవలం సచ్చరిత కల్గిన వారినే ఎన్నుకునే అవకాశం ఇవ్వాలి. 

4. న్యాయ వ్యవస్థలో మార్పులు: “అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్” సూచన మేరకు సుప్రీంకోర్టు గ్రామ స్థాయిలో ‘విలేజ్ కోర్టులు’ మరియు ‘మొబైల్ కోర్టు’లు ఏర్పాటు చేయాలని, గ్రామ స్థాయి సమస్యలు అక్కడే సత్వరం పరిష్కరించాలని చెప్పింది. అది వెంటనే అమలు చేయాలి.

5. ప్రభుత్వ పరిదిలో ప్రజలకు సేవలందించే సంస్థలు, విభాగాలు తమ సేవలకు సంబందించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ లో అందించాలి. రియల్ టైం లో ఈ సమాచారం అప్డేట్ చేయాలి.   

6. వెబ్ సైట్ లో ప్రతి వారం, ఆ వారంలో వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులు, అందులో పరిష్కారమైన వివరాలు అప్డేట్ చేయాలి.

7. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో "సేవల పట్టిక" సమయం, బాధ్యుల సమాచారంతో తెలుగులో పెట్టాలి.

8. అన్ని కార్యాలయాలలో దీని కోసం ప్రవేశద్వారం వద్దనే రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేసి, ప్రజలకు సమాచారం అందించి, కార్యాలయ సిబ్బందికి, ప్రజలకు అనుసంధానంగా ఉండాలి. 

9. అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని వేళల ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

10. అన్ని కార్యాలయాల ఉన్నత అధికారులు ప్రతి వారం నిర్ణీత సమయంలో ‘ప్రజావాణి’ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలి. 


Related Post