వై.ఎన్. లోహిత్ దర్శకత్వంలో శ్రీనివాస్ గవిరెడ్డి, బ్రిగిడ సాగ జంటగా నటిస్తున్న సినిమా పేరు ‘చీన్ టపాక్ డమ్ డమ్.’ ఈ సినిమా నుంచి ‘మరోక్కసారి..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
తిరుపతి జవానా వ్రాసిన ఈ పాటకు పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీతం అందించి స్వరపరచగా, కార్తీక్ ఆలపించారు.
ఈ సినిమాలో షఫీ, దువ్వాడ మాధురి, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
విలేజ్ టాకీస్ బ్యానర్‌పై శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వై.ఎన్. లోహిత్, సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్), కెమెరా: సెంథిల్ కుమార్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.