సూపర్ హిట్ మూవీ ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్, సాయిపల్లవి, మమ్ముట్టి, శ్రీలీల, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలు చేసిన ‘ఓం’ నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడినందున సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో ధనుష్, సాయిపల్లవి, మమ్ముట్టి, శ్రీలీల పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే సూపర్ హిట్ ‘పుష్ప’ వంటి కథతోనే ఈ సినిమా తెరకెక్కించినట్లనిపిస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి ఎర్ర చందనం స్మగ్లర్ల ఆట కట్టించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు.
ఈ సినిమాకు రచన, దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి, సంగీతం: సాయి అభ్యంకర్, కెమెరా: ఎజిల్ అరసు కె, యాక్షన్: యానిక్ బెన్, కెచా ఖంఫక్డీ, ఆర్ట్: ఎ. పన్నీర్‌సెల్వం, కొరియోగ్రఫీ: శాండీ, ఎడిటింగ్: ఆర్. కళైవాణన్ చేశారు.
ఆర్ టేక్ సమర్పణలో ఉండర్‌బార్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రద్ధ అగర్వాల్, ధనుష్, అజ్మాట్ జగ్‌మగ్ కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మించారు.