వృషకర్మ నుంచి స్వాగ్ ఆఫ్ అర్జున్.. తొలిపాట

November 07, 2026


img

కార్తీక్ దండు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ పేరుతో మొదటి పాట నేడు విడుదలైంది. అభినవకవి ప్రణవ్ చాగంటి వ్రాసిన ఈ పాటకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించి స్వయంగా పాడారు.   

ఈ సినిమాలో హిందీ సినిమా ‘లాపతా లేడీస్’తో మంచి నటుడుగా తెచ్చుకున్న స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 4వ తేదీన వృషకర్మ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష