భోగి నుంచి ఫస్ట్ సింగిల్... వెరైటీ పోస్టర్‌

October 08, 2026


img

సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘భోగి’ సినిమా నుంచి మొదటి పాట శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటలకు విడుదల కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ పెట్టిన పోస్టర్‌ చాలా వెరైటీగా ఉంది. . 

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కందుల సులోచనా రాణి అఅనే గిరిజన మహిళగా నటిస్తోంది. 1960లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, పోరాటాల నేపధ్యంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్‌, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నె చేస్తున్నారు. 

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 28న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వలన నవంబర్‌ 12కు వాయిదా పడింది.


Related Post

సినిమా స‌మీక్ష