పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్నసినిమా ‘స్లమ్ డాగ్ టెంపుల్ స్ట్రీట్-33’. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వాహెబ్‌ను హీరో తల్లి జుబేదాగా పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లిమ్స్ మనసులను కదిలించేలా అద్భుతంగా ఉంది.
‘ఆకలి నాకు తెలియకుండానే చేతులు చాచేలా చేసింది..’ ‘అమ్మ ఉన్నది అన్నం పెట్టేందుకు అడుక్కునేందుకు కాదు,” వంటి డైలాగ్స్ మనసులను టచ్ చేస్తాయి.
ఈ సినిమాలో టబూ ఇన్‌కమ్ టాక్స్ డిప్యూటీ కమీషనర్ గౌరీ హెగ్డేగా నటిస్తున్నారు. ఇదివరకు విడుదల చేసిన గ్లిమ్స్‌లో ఆమె పరిచయం కూడా అద్భుతంగా ఉంది. లైగర్ సినిమాతో దెబ్బ తిన్న పూరీ జగన్నాథ్ ఈ సినిమాతో తప్పకుండా సూపర్ హిట్ కొట్టబోతున్నట్లే ఉన్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి, టాబు, సంయుక్త, దునియా విజయ కుమార్, జరీనా వాహబ్, విటివి గణేశ్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: పూరీ జగన్నాథ్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: శ్యాం కే నాయుడు, ఆర్ట్: ఆశిష్ తేజ, జానీ షేక్, ఎడిటింగ్: సంతోష్ నూజిల్లా చేశారు.
పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణ రావు కలిసి జేబి మోషన్ పిక్చర్స్, పూరీ కనెక్ట్స్’ బ్యానర్లపై పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.