ప్యారడైజ్ విమర్శలపై నాని రియాక్షన్.. వెరీ గుడ్!

September 25, 2026


img

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా కథ, స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ కనెక్ట్, కొన్ని సన్నివేశాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమాలో నాని నటన అద్భుతం అంటూ ప్రశంసలు కూడా వస్తున్నాయి. 

బహుశః అందువల్లేనెమో ప్యారడైజ్ సినిమాపై రివ్యూలు నెగెటివ్‌గా ఉన్నప్పటికీ కలెక్షన్స్‌లో దూసుకుపోతోంది. కానీ సినిమాపై వస్తున్న విమర్శలు, కామెంట్స్‌పై నాని స్పందన చాలా హుందాగా ఉంది. 

‘నేను ప్రేక్షకుల రియాక్షన్స్ అన్నింటినీ చూశాను. నాపై, ఈ సినిమాపై చూపిస్తున్న మీ ప్రేమకు ధన్యవాదాలు. అలాగే కామెంట్స్ ను సరదాగా తీసుకుంటాను. విమర్శలు, రివ్యూల నుంచి సినిమాలో లోపాలు తెలుసుకుని సరిదిద్దుకుంటాను. 

ఇప్పుడు ‘ప్యారడైజ్‌’ ప్రేక్షకులకు అప్పగించాము.  దానిని మెచ్చుకున్నా తిరస్కరించినా అంతా వారి చేతుల్లోనే ఉంది. కానీ ప్రేక్షకులు దీనిని తమ సినిమాలా భావించి ఆదరిస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. 

ఈ సినిమా కోసం మేమందరం చాలా కష్టపడి పనిచేశాము. కానీ ప్రేక్షకుల తీర్పు ఎలా ఉన్నా గౌరవిస్తాము. సినిమా నచ్చితే ఆస్వాదించడం, నచ్చకపోతే విమర్శించడం ప్రేక్షకుల హక్కే, “ అని ఎక్స్‌లో ఓ మెసేజ్ పోస్ట్ చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష