అక్టోబర్‌లో టాలీవుడ్‌ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు

September 23, 2026


img

టాలీవుడ్‌ డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాలపై ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యం చేసుకుంది. సుమలత, రఘు మాస్టర్‌తో సహా 225 మంది డ్యాన్సర్లతో ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 

సమావేశంలో రెండు వర్గాలకు వాదనలు విన్న తర్వాత బలాబలాలు పరిశీలించగా, సుమలతకు 11 మంది డ్యాన్సర్లు మద్దతు ఇవ్వగా, రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు తెలిపినట్లు సమాచారం. దీంతో డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో సుమలత ఆధ్వర్యంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. 

దీంతో కొత్త కార్యవర్గం ఏర్పాటు కోసం ఎన్నికలకు మార్గం సుగమమైంది. అక్టోబర్ 11న డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ వెల్లడించింది.


Related Post

సినిమా స‌మీక్ష