విశ్వక్ సేన్‌ #కల్ట్ అక్టోబర్ నెలాఖరున

September 20, 2026


img

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ సొంత  కధతో స్వీయ దర్శకత్వంలో చేస్తున్న#కల్ట్ రిలీజ్‌ డేట్ ప్రకటిస్తూ ఓ ప్రమో కూడా వదిలారు. ఓ క్లబ్బులో విశ్వక్ సేన్‌ నరుకుడు చూస్తే #కల్ట్ సినిమా కథ ఏమిటనే ఆసక్తి కలుగుతుంది. 

ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌, అయాత్రి భరద్వాజ్‌, తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కార్తికేయ, అనిరుధ్‌ భాస్కర్‌, ఈజీ, యజ్ఞ తుర్లపాటి, కబీర్‌ భారతీయ, విశాఖ్‌ నాయర్‌, చేవూరి వివేక్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్‌సేన్‌; సంభాషణలు: తరుణ్‌ భాస్కర్‌; సంగీతం: రవి బస్రూర్‌; సినిమాటోగ్రఫీ: అరవింద్‌ విశ్వనాథన్‌; స్టంట్స్‌: కరుణాకర్‌, జాషువా, ఆర్ట్: అరవింద్ మూలే; ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల చేస్తున్నారు. 

తారక్ సినిమాస్, వాన్మయి క్రియేషన్స్ బ్యానర్లపై సందీప్‌ కాకరాల నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లో అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Related Post

సినిమా స‌మీక్ష