ఆదర్శ కుటుంబంలో డింపుల్ హయతీ సో స్పెషల్..

September 17, 2026


img

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా చేస్తున్న ‘ఆదర్శకుటుంబం’ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ కనిపిస్తోంది. ఈ సినిమాలో డింపుల్ హయాతి ఓ స్పెషల్ సాంగ్‌లో వెంకీమామతో కలిసి డాన్స్ చేసినట్లు టాక్. అయితే ఆదర్శ కుటుంబం ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

ఈ సినిమాలో నారా రోహిత్, నివేథా పేతురాజ్,యువినా పార్థవి, రాజా ప్రైవల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్‌; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేస్తున్నారు.

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష