హైదరాబాద్ అంబర్‌పేటలోని ప్రముఖ తెలుగు సినీ డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు కొందరు మహిళలు శనివారం ధర్నా చేశారు. ఆయన తమకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తమ వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని, కానీ ఎవరికీ ఒక్క సినిమాలో కూడా అవకాశం ఇప్పించలేదని సదరు మహిళలు ఆరోపించారు. తమ వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని తెలిపారు.
తమ డబ్బు తిరిగి ఇచ్చే వరకు అక్కడి నుంచి కదలమంటూ మహిళలు ధర్నా చేశారు. ఈ సమాచారం అందుకున్న అంబర్‌పేట పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు శివకుమార్ గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆయనకు నోటీసు ఇచ్చి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఈ వ్యవహారంపై ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై శివకుమార్ గౌడ్ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది.
Victims protest at the residence of film distributor Shivakumar Goud.
— Shakeel Yasar Ullah (@yasarullah) September 12, 2026
They alleged that Shivakumar had collected lakhs of rupees from several individuals by promising to secure film offers for them. pic.twitter.com/sQCOa6f0IC