ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జా హీరోగా చేసిన ‘జాంబీరెడ్డి’కి సీక్వెల్‌గా ‘జాంబీరెడ్డి-2’ వస్తోంది. ఈరోజు తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ‘జాంబీరెడ్డి-2’ టైటిల్ గ్లిమ్స్ విడుదల చేశారు. అయితే ‘జాంబీరెడ్డి-2’కి ప్రశాంత్ వర్మకి బదులు సుపర్న్ ఎస్ వర్మ దర్శకత్వం చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఈ సినిమా క్రియేటర్‌గా పర్యవేక్షిస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులకు ‘జాంబీలను’ పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాలు, ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి వాటితో మంచి అనుభవం కూడా సంపాదించుకున్నారు. టైటిల్ గ్లిమ్స్‌లో చార్మినార్ వద్ద చుట్టుముట్టిన జాంబీలను హీరో ఎదుర్కొంటున్నట్లు చూపారు. కనుక ఈసారి జాంబీరెడ్డి-2 మరింత అద్భుతంగా ఉండవచ్చు. ఈ సినిమాలో తేజ సజ్జా, రియల్ స్టార్ ఉపేంద్ర, షనాయా కపూర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కథ: హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్, ప్రశాంత్ వర్మ, సుపర్న్ ఎస్. వర్మ, డైలాగ్స్: సుబ్బు కే, సంగీతం: గౌర హరి, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం, ఎడిటింగ్: విజయ్ వెలుకుట్టి చేస్తున్నారు. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ‘జాంబీరెడ్డి-2’ ‘డెడ్ అర్ అలైవ్’గా 2027లో విడుదల కాబోతోందని టైటిల్ గ్లిమ్స్‌లో తెలియజేశారు.