దర్శకుడు వెంకీ అట్లూరి తమిళ హీరోలతో సినిమాలు కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయినట్లున్నారు. ప్రస్తుతం సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా పూర్తిచేసిన వెంకీ అట్లూరి, తర్వాత ధనుష్‌తో చేయబోతున్నట్లు స్వయంగా తెలిపారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సర్’ సూపర్ హిట్ అయ్యింది. ఇటీవల ధనుష్‌ని కలిసి కథ చెప్తే అయన వెంటనే ఓకే చెప్పేశారని వెంకీ అట్లూరి చెప్పారు. కనుక మరోసారి ధనుష్‌తో చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నానని చెప్పారు.
ఈ సినిమా పూర్తిస్థాయి పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు సమాచారం. హై వోల్టేజ్ యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయని వెంకీ అట్లూరి తెలిపారు. పోలీస్ జానర్‌లో తాను ఇప్పటివరకు పెద్దగా సినిమా చేయలేదని కనుక ఈ సినిమా తనకు కొత్త సవాలుగా ఉంటుందని వెంకీ అట్లూరి చెప్పారు.