నందిని రెడ్డి- సమంత కాంబినేషన్‌కి తిరుగులేదని మరోసారి నిరూపించిన సినిమా ‘మా ఇంటి బంగారం.’ జూన్ 19న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ, మంచి కలెక్షన్స్‌తో ఇంకా దూసుకుపోతోంది.
సినిమాల సక్సస్ కోసం దర్శక నిర్మాతలు రకరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తుంటారు. అటువంటిదే ఎడిటింగ్‌లో కత్తిరించేసిన సన్నివేశాలను రిలీజ్ చేయడం. మా ఇంటి బంగారంలో ఎడిటింగ్‌లో కత్తిరించేసిన మంచి కామెడీ సీన్లను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
అవి కూడా ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. కానీ సినిమాకి అవసరం లేదనిపించి లేదా వాటి వలన నిడివి పెరుగుతుందనో కత్తిరించేశారు. అవిప్పుడు ఫ్రీగా చూసి ఆనందించవచ్చు.
ఈ సినిమాలో గౌతమి, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, దర్శకత్వం: నందినీ రెడ్డి, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాష్, డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: లీ విట్టకేర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.
సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి కలిసి ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కించారు. దీనికి సీక్వెల్ ఉంటుందని రాజ్ నిడిమోరు ప్రకటించిన సంగతి తెలిసిందే.