మంచు మనోజ్.. డేవిడ్ రెడ్డి టీజర్‌ రెడీ

May 17, 2026


img

మంచు మనోజ్ దాదాపు 11 ఏళ్ళ తర్వాత చేసిన భైరవం, మిరాయ్ సినిమాలతో మరోసారి తన సత్తా చూపారు. వాటి తర్వాత వై.హనుమ రెడ్డి దర్శకత్వంలో ‘డేవిడ్ రెడ్డి’ మొదలు పెట్టి దాదాపు పూర్తి చేశారు. హనుమారెడ్డి యక్కంటి దర్శకత్వం సిద్ధమవుతున్న డేవిడ్ రెడ్డి టీజర్‌ ఈ నెల 20న విడుదల కాబోతోందని తెలియజేస్తూ మంచు మనోజ్ రైల్వే ట్రాక్ మధ్యలో నిలబడిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వేశారు.  

ఇదొక పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌. దీనిలో ఉక్రెయిన్ అందాల భామ మరియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తోంది.  ఆమె ఇదివరకే స్పెషల్ ఓపిఎస్ 1.5 అనే వెబ్‌ సిరీస్‌తో భారతీయ సినీ పరిశ్రమలో ప్రవేశించారు. ఆ తర్వాత అనుదీప్ కెవి దర్శకత్వం శివకార్తికేయాన్‌కు జోడీగా ‘ప్రిన్స్’ సినిమాలో నటించారు. ఇప్పుడు ‘డేవిడ్ రెడ్డి’తో కలిసి విదేశీ యువతి ‘క్లారా విట్మోర్‌’గా నటించింది. ‘ఆమె ప్రేమ ఓ యుద్ధం’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె పాత్రని పరిచయం చేశారు. 

కేజీఎఫ్ వంటి సూపర్ హిట్‌ సినిమాకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, కోరియోగ్రఫీ: సుప్రీం సుందర్ చేస్తున్నారు. 

వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్లపై మోతుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష