నేడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా తన 23వ సినిమా ప్రకటించారు. విశేషమేమిటంటే ఈ సినిమాకి స్వయంగా కథ సిద్ధం చేసుకున్న రామ్ పోతినేని దర్శకత్వం కూడా చేయబోతున్నారు.
స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో రామ్ పోతినేని పాత్ర పేరు ‘వీర.’ ఈ సినిమా ప్రకటిస్తూ వేసిన పోస్టర్ వెరైటీగా ఉంది.
లెదర్ జాకెట్ ధరించి వెనక్కు తిరిగి నిలబడిన రామ్ పోతినేని పోస్టర్ చూస్తే ఈ సినిమాలో ఇదివరకు ఎన్నడూ చూడని గెటప్‌లో కనిపించబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇది ‘ఒంటరి తోడేలు కథ’ అంటూ సినిమాపై ఆసక్తి రేకెత్తించారు.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై క్రిష్ణ పోతినేని నిర్మించబోతున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదలవుతుందని కూడా చెప్పేశారు. రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు కనుక ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొబ్బరికాయ కొట్టేసి ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించడం ఖాయం.