విశ్వక్ సేన్‌ కొత్త సినిమా లిగసీ ఫస్ట్ లుక్ పోస్టర్‌

March 29, 2026


img

డైనమిక్ యువ నటుడు విశ్వక్ సేన్‌ పుట్టినరోజు సందర్భంగా నేడు అతని కొత్త సినిమా టైటిల్‌ పోస్టర్ విడుదల చేశారు. ఆరోహి దైడ సమర్పణలో కలాహి మీడియా బ్యానర్‌పై సాయికిరణ్ రెడ్డి దైడ స్వీయ దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటితో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘పాలిటిక్స్ ఈజ్ పర్సనల్’ అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు కనుక చేతిలో తుపాకీతో విశ్వక్ సేన్‌ ఆ  ‘రాజకీయ వారసత్వం’ కొనసాగిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సూచించారు. 

ఈ సినిమాకు కధ: సాయికిరణ్ రెడ్డి దైడ, కవి సిద్దార్థ, పాటలు: అనంత్ శ్రీరాం, కవి సిద్దార్థ, సంగీతం: గోవింద్ వసంత్, కెమెరా: జీజు సన్నీ, యాక్షన్: ఝాషువా, ఎడిటింగ్: శిరీష్ ప్రసాద్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటీనటుల వివరాలు ప్రకటిస్తారు.       



Related Post

సినిమా స‌మీక్ష