తెలంగాణాలో ఈ మార్పులు గమనించారా?

October 05, 2017


img

  ఎక్కడో విదేశాలలో ఉంటున్న తెలంగాణావాసులు ఏనాడూ తమ మాతృదేశాన్ని, స్వరాష్ట్రాన్ని, పుట్టిపెరిగిన ఊరును, ఆత్మీయ బంధుమిత్రులను మరిచిపోలేదు. తాము పుట్టిపెరిగిన ఈ గడ్డకు, తాము ఈ స్థాయికి ఎదగడానికి సహకరించిన సమాజానికి, దానిలో అభాగ్యులకు, అసహాయులకు ఎప్పుడూ ఏదో చేయాలని పరితపిస్తుంటారు. 

ఆ ప్రయత్నంలోనే అమెరికాలో తెలంగాణావాసులు ‘డయల్ యువర్ విలేజ్’ అనే ఒక కార్యక్రమం చేపట్టి రాష్ట్రాభివృద్ధికి వివిధ రంగాలలో కృషి చేస్తున్న అనేకమంది ప్రముఖులతో  ఫోన్ ద్వారా మాట్లాడి, వారి ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నారు. వారు అందించిన ఆ సమాచారం ఆధారంగా అమెరికాలో తెలంగాణావాసులు ఉడతాభక్తిగా తమ గ్రామాలకు, జిల్లాలకు, రాష్ట్రానికి తమవంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఆ సమాచారం ఆధారంగా అభాగ్యులకు, ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు, అన్ని వర్గాలవారికి సహాయసహకారాలు అందిస్తున్నారు. 

ఇటీవల డయల్ యువర్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ఈసారి వారు తెలంగాణా సాంస్కృతిక శాఖకు డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణగారితో ఫోన్లో మాట్లాడి, రాష్ట్రంలో మొదలైన సాంస్కృతిక ఉద్యమం గురించి తెలుసుకొన్నారు. ఆ వివరాలు మీ కోసం:  

ఒకప్పుడు సమైక్యరాష్ట్రంలో తెలంగాణా అన్ని రంగాలలో వివక్షకు గురైనట్లే, బాష, యాస, సంస్కృతి, సాహిత్యం, కళలు, ఆచార వ్యవహరాలు అన్నీ వివక్షకు గురయ్యాయి. తెలంగాణా ఏర్పడిన తరువాత ఒకవేళ కేసీఆర్ కాకుండా వేరెవరైనా ముఖ్యమంత్రి అయ్యుండి ఉంటే ఆనాటి పరిస్థితులలో బహుశః ఎటువంటి మార్పులేకుండా యధాతధంగా కొనసాగి ఉండేవేమో? కానీ అన్ని రంగాలలో తెలంగాణా గొప్పదనాన్ని చాటిచెప్పాలని తపించే కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం వలన ఈ మూడేళ్ళలో అన్ని రంగాలలో కళ్ళకు కనబడేంతగా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. 

ఆయన దూరదృష్టి, సమర్ధత, నాయకత్వ లక్షణాలు, రాజకీయ చతురత అందుకు ప్రధాన కారణాలని అందరికీ తెలుసు. అయితే బంగారి తెలంగాణా సాధన కోసం ఆయన ఒకరే శ్రమిస్తే సాధ్యం కాదు. అంతటి తపన కలిగిన బలమైన సైన్యం కూడా ఉండాలి. ఆయన సైన్యంలో అటువంటి ఒక సైనికుడే మామిడి హరికృష్ణ. ఆయన శ్వాసించేది తెలంగాణా కోసం. ఆయన జీవించేది తెలంగాణా కోసం. ఆయన తపన అంతా బంగారి తెలంగాణా కోసమే. అందుకే కేసీఆర్ అయనను ఏరికోరి తెలంగాణా సాంస్కృతిక శాఖకు డైరెక్టర్ గా నియమించుకొన్నారు. 

సాధారణంగా రాజకీయాలలో ఉన్నవారికి ఆ శాఖ అంటే చాలా చులకన. ఏదో ఓ పదవి ఇవ్వక తప్పదు గాబట్టి దానిని తమకు అంటగట్టారని బాధపడినవారున్నారు. కానీ హరికృష్ణ మాత్రం తన ఆశయాలు, ఆలోచనలు అమలుచేయడానికి అదే ఒక గొప్ప అవకాశంగా భావించి రోజుకు 12-14 గంటలు మహదానందంగా పనిచేసుకొనిపోతున్నారు. 

ఆయన తెర వెనుక నిరంతరంగా నిశబ్దంగా పనిచేసుకుపోతుంటారు కనుక బహుశః నేటికీ సామాన్య ప్రజలకు అయన గురించి తెలియకపోయుంటే ఆశ్చర్యం లేదు. కానీ అయన చేస్తున్న ఆ కృషి వలన ఈ మూడేళ్ళలోనే రాష్ట్రంలో తెలంగాణా బాష, సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగలు, ఉత్సవాలు, సాహిత్య, కళా కార్యక్రమాలు అన్నీ ఘనంగా జరుగుతుండటం అందరూ చూస్తున్నారు. ఆయన చొరవ కారణంగా మరుగునపడిన అనేక సాహిత్య, కళా రూపాలు మళ్ళీ జీవం పోసుకొని, తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని యావత్ దేశం, యావత్ ప్రపంచం గుర్తించేలా చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏ సందర్భంలో ఏ కార్యక్రమాలలోనైనా, తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే కార్యక్రమాలు జరుగుతూ కనిపిస్తున్నాయి. 

బలమైన తెలంగాణా బాష, యాస, సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకొంటూ వాటిని అందరూ గుర్తించి ఆధారించేలా చేయగలిగితే, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుందని బలంగా నమ్మే వ్యక్తి మామిడి హరికృష్ణ. తను నమ్మిన దానిని అక్షరాల పాటిస్తూ ముందుకు సాగిపోతున్నారు. 

తెలంగాణా సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాలనే తపన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు అన్ని విధాలసహాయసహకారాలు అందిస్తుండటంతో ఆయన రాష్ట్రంలో కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, బాషా పండితులు, మేధావులు అందరినీ కలుపుకొనిపోతూ తెలంగాణా సంస్కృతీ సాంప్రదాయాలకు పునరుజ్జీవనం కల్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తెర వెనుక ఆయన చేస్తున్న ఆ ప్రయత్నాలు..వాటి ఫలితాల గురించి తరువాత వ్యాసంలో చెప్పుకొందాము. సశేషం.

మామిడి హరికృష్ణగారి పూర్తి సంభాషణ వినలనుకొంటే ఈ క్రింది లింకులో వినవచ్చు.

https://fccdl.in/X0dA8WMrY 

మీరు ఈ చర్చల్లో పాల్గొనాలనుకుంటే, ఈ క్రింది whatsapp గ్రూప్ ఆహ్వానం క్లిక్ చేసి, గ్రూప్ లో జాయిన్ అవండి.

https://chat.whatsapp.com/GchpC6r5qyF1sZOKWVRMng 

"డయల్ యువర్ విల్లేజ్" ఫేస్ బుక్ లింక్: https://www.facebook.com/groups/821757117915265/ 


Related Post