ప్రియదర్శి డార్లింగ్ వచేస్తున్నాడు

April 21, 2024


img

డార్లింగ్ అనగానే ప్రభాస్‌, ఆయన నటించిన డార్లింగ్ సినిమాయే అందరికీ గుర్తుకు వస్తుంది. తాజాగా కామెడీ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్న యువ నటుడు ప్రియదర్శి కూడా ‘డార్లింగ్ ‘వై దిస్ కొలవెరీ’ పేరుతో ఓ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

అశ్విన్ రామ్ దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్‌ శనివారం విడుదల చేశారు. 

‘తల్లిగా, చెల్లిగా, ప్రియురాలిగా మగవాళ్ళని లాలించే ఆడపిల్లలు భార్యగా మారగానే ఎందుకు రాక్షసులుగా మారిపోయి భర్తలని వేధిస్తారో’ అంటూ ఫస్ట్ గ్లిమ్స్‌లోనే ఈ సినిమా స్టోరీ ఏమిటో చెప్పేశారు. 

ఫస్ట్ గ్లిమ్స్‌ చాలా ఆకట్టుకుంది కానీ ఈ చిన్న పాయింట్‌తో ప్రేక్షకులను సినిమా మొత్తం నడిపించడం చాలా కష్టమే కానీ మెప్పించగలిగితే ప్రియదర్శి ఖాతాలో మరో హిట్ పడిన్నట్లే. 

ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా నభా పటేల్ నటిస్తుండగా, రఘుబాబు, శివారెడ్డి, అనన్య నాగల్ల, మొయిన్, మురళీధర్ గౌడ్, కళ్యాణీ రాజ్, సునీత మనోహర, ముళ్ళపూడి రాజేశ్వరి, అభిజ్ఞయ, ప్రియాంక, స్వాప్నిక, శివరంజని, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.        

ఈ సినిమాకు పాటలు కాసర్ల శ్యామ్, డైలాగ్స్: ఎస్‌ హేమంత్, సంగీతం: వివేక్‌ సాగర్, కెమెరా: నరేశ్ రామదురై, ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్ చేస్తున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష