రాములమ్మ ఆమెను రహస్యంగా ఎందుకు కలిసిందో?

June 06, 2017


img

అలనాటి మేటి నటి, మాజీ ఎంపి, ప్రస్తుత తెలంగాణా కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి సోమవారం సాయంత్రం బెంగళూరులో వెళ్ళి అక్కడ పరపన్న అగ్రహర జైలులో శశికళతో రహస్యంగా సమావేశం అయినట్లు తాజా సమాచారం. తెలంగాణాకు చెందిన విజయశాంతి తమిళనాడుకు చెందిన శశికళతో రహస్యంగా జైలులో సమావేశం కావడం గమనిస్తే ఆమె ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా తమిళనాడు రాజకీయాలపై పట్టు సాధించేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నట్లు అనుమానం కలుగుతోంది. లేకుంటే జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళను విజయశాంతి రహస్యంగా కలువవలసిన అవసరమే లేదు. 

శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల మద్య ఆధిపత్యపోరు జరుగుతున్నప్పుడు విజయశాంతి బహిరంగంగానే శశికళకు మద్దతు ప్రకటించారు. ఆమె మద్దతు ప్రకటించడం వలన శశికళకు ఒరిగేదేమీ లేకపోయినా ఆమాటతో ఆమె అన్నాడిఎంకెలో బలమైన వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శశికళకు దగ్గరకాగలిగారు. 

తమిళనాడు రాజకీయలపై పట్టు సాధించేందుకు భాజపా పన్నీర్ సెల్వం ద్వారా తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది కనుక విజయశాంతి ద్వారా శశికళను మచ్చిక చేసుకొని ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న పళనిస్వామి వర్గాన్ని కాంగ్రెస్ అధిష్టానం మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తోందేమో?అయితే పళనిస్వామి వర్గం శశికళకు, ఆమె మేనల్లుడు దినకరన్ తదితరులను దూరం పెట్టింది. కనుక విజయశాంతి జైలులో ఉన్న శశికళతో ఎందుకు సమావేశం అయ్యారు? ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా లేక బెడిసికొడతాయా? అనేది మున్ముందు తెలియవచ్చు. 


Related Post