రజనీకాంత్ కు వ్యతిరేకంగా ఆందోళనలు!

May 22, 2017


img

సూపర్ స్టార్ రజనీకాంత్ మాట అంటే తమిళనాడులో వేదవాక్కుగా భావించేవారు లక్షలాదిమంది ఉన్నారు. కానీ అయన రాజకీయ ప్రవేశం చేస్తారనే వార్తలు రాగానే తమిళ మున్నేట్ర పడాయ్‌ అనే తమిళ సంఘాల ప్రతినిధులు ఆయన రాజకీయాలలోకి రావద్దని కోరుతూ ఈరోజు చెన్నైలోని అయన ఇంటి ముందు ఆందోళనలు చేశారు. 

ఆయన ఇటీవల అభిమానులతో సమావేశం అయినప్పుడు యధాప్రకారం ఆయన “పైనున్న ఆ దేవుడు శాశిస్తే నేను తప్పకుండా రాజకీయాలలోకి వస్తాను,’ అని పలకడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. కానీ సమావేశం ముగించే ముందు “యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి అభిమానులు అందరూ సిద్దంగా ఉండాలి,” అని అయన పలికిన చిన్న డైలాగ్ తో అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆయన రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారనే ప్రచారం మొదలైపోయింది. అవే కొంపముంచాయి. 

ఆ వార్తలు చూసి తమిళనాడులో కొన్ని రాజకీయవర్గాలు కంగారు మొదలయింది. ఆయన రాజకీయ ప్రవేశం చేస్తే తమకు రాజకీయంగా నష్టం కలుగవచ్చని భావించిన కొన్ని రాజకీయ శక్తులు ఆయన స్థానికతను ప్రశ్నించడం మొదలుపెట్టాయి. కర్నాటకకు చెందిన రజనీకాంత్ కు తమిళనాడు రాజకీయాలతో పనేమిటి? అని ప్రశ్నిస్తూ ఆయన రాష్ట్ర రాజకీయాలలోకి ప్రవేశించరాదని మంగళవారం 

 ఒకవేళ రజనీకాంత్ రాజకీయాలలోకి ప్రవేశించదలిస్తే భాజపాలో చేరాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆహ్వానం పలికారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ త్వరలో డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలువబోతునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవే నిజమైతే ఆయన భాజపాలో చేరబోతున్నట్లు భావించవచ్చు. భాజపా ఒకవేళ ఆయనను పార్టీలోకి ఆకర్షించగలిగితే, తమిళనాడులో అడుగుపెట్టడానికి దానికి రాజమార్గం ఏర్పడినట్లే భావించవచ్చు. కొద్దిరోజులలోనే ఈ  సస్పెన్స్ వీడిపోవచ్చు. 

కానీ ఆయన ఈ వయసులో రాజకీయ ప్రవేశం చేసినట్లయితే దాని వలన ఆయనకు కొత్త ఇబ్బందులు, కొత్త శత్రువులు పుట్టుకువచ్చి అనేక సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. ఈరోజు అయన ఇంటి ముందు జరిగిన ఆందోళనలు వాటికి చిన్న శాంపిల్ గా చూడవచ్చు. 


Related Post