ఆ మహిళలకు వందనాలు..అభినందనాలు

March 08, 2017


img

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో కృషి చేస్తున్న 24 మంది మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవార్డులు ఇవ్వబోతున్నారు. దానితో బాటు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు నగదు పారితోషికం కూడా ఇవ్వనున్నారు. వారిలో తెలంగాణా రాష్ట్ర సాధనకోసం పోరాడినవారే    ఎక్కువ మంది ఉండటం విశేషం. 

నేడు అవార్డులు అందుకోబోతున్నవారు: 

సామాజిక సేవ: దృష్టి లోపం ఉన్న దివ్యాంగులు: జానకి, గాయత్రి. (వీరిరువురూ మూగ చెవుడు విద్యార్ధుల పాఠశాల నడిపిస్తున్నారు.) వీరిలో శ్రీమతి గాయత్రి వనపర్తి జెడ్.పి.హెచ్.ఎస్.లో హెడ్ మాష్టారుగా పనిచేస్తున్నారు. కూర్మ లక్ష్మీ భాయ్: ఆదిలాబాద్ జిల్లాలో దాహిగూడ గ్రామానికి చెందిన ఈమె అలుపెరుగని పోరాటం చేసి  తన భూమిని తిరిగి దక్కించుకొన్నారు.  

తెలంగాణా ఉద్యమాలు: తెలంగాణా ఉద్యమకారులు టి. దేవికాదేవి (మహబూబ్ నగర్) ఆమె 1969లో, మళ్ళీ చివరిదశ తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. ఎస్.మణెమ్మ (ఉప్పల్), డిస్వప్న (హైదరాబాద్), ఎం. విజయ రెడ్డి (పెద్దపల్లి). 

విద్యా రంగం: ఉస్మానియా యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సిలర్: డాక్టర్ విద్యావతి.

వ్యవసాయం: మహిళా రైతులు: దుద్దేడ సుగుణమ్మ (జనగామలో కట్కూర్), నాగమణి (దోసపాడు). వీరిరువురూ ఆధునిక సేద్య విధానాలతో అత్యుత్తమ దిగుబడి సాధించారు.  

వృత్తిపరమైన సేవలు: ప్రమీల న్యాయవాది (మంచిర్యాల) తెలంగాణా ఉద్యమకారులు.

సాహిత్యం: అనిశెట్టి రాజిత (వరంగల్), షాజహాన (ఖమ్మం) మహిళల సమస్యలపై అనేక పుస్తకాలు వ్రాశారు.

జర్నలిజం: మాడపాటి సత్యవతి (హైదరాబాద్) ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్. కట్ట కవిత: (చిట్యాల్, నల్గొండ) జర్నలిస్ట్. జి.మల్లేశ్వరి: (వరంగల్) మొట్టమొదటి వీడియో జర్నలిస్ట్

క్రీడలు: కామన్ వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగులో బంగారుపతకం సాధించిన ప్రియదర్శిని (వరంగల్).

నృత్యం: డాక్టర్ వనజ ఉదయ్ (హైదరాబాద్) తెలుగు యూనివర్సిటీలో డ్యాన్స్ విభాగానికి అధిపతి. గత 25 ఏళ్ళుగా నృత్యంలో అనేకమందికి శిక్షణ ఇస్తున్నారు.

చిత్రలేఖనం: శ్రీమతి అంజనీ రెడ్డి (నిజామాబాద్) ప్రముఖ చిత్రకారిణి.

సంగీతం: పాయల్ కొటగరీకర్ (నిజామాబాద్) ప్రముఖ తబలా విద్వాంసురాలు.   

పాటలు: తమ పాటల ద్వారా తెలంగాణా ఉద్యమ స్ఫూర్తి రగిలించినందుకుగాను చైతన్య (నల్గొండ), స్వర్ణ (కరీంనగర్).  

నగదు రహిత లావాదేవీలు: ఎం.పద్మ: తిమ్మాపూర్ సర్పంచ్ (కరీంనగర్) కుంభాల లక్ష్మి: గొల్లపల్లి సర్పంచ్ (ఇబ్రహీంనగర్ సిద్ధిపేట)

100 శాతం నగదు రహిత లావాదేవీలు అమలుచేసినందుకు.


Related Post