ఇప్పుడు ఆ ఊసే లేదు!

February 16, 2017


img

నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నోట్ల కొరతను అధిగమించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా మొబైల్ యాప్ లు ప్రవేశపెట్టాయి. ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలు మాత్రమే చేయాలని చాలా ప్రచారం చేశాయి. దిజితాల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం వీక్లీ, మంత్లీ పద్దతిలో బారీ నగదు బహుమతులను కూడా ఇచ్చింది. తెలంగాణా రాష్ట్రంలో కొన్ని జిల్లాలు, ప్రాంతాలు ప్రభుత్వశాఖలలో నగదు రహిత లావాదేవీలను చాలా గట్టిగానే అమలు చేశారు కూడా. దాని అమలులో కూడా తెలంగాణా రాష్ట్రంతో మన పొరుగు రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడి హడావుడిగా మొబైల్ యాప్ తీసుకు వచ్చింది. తెరాస సర్కార్ చెప్పిన ఆ టీ వాలెట్ ఇంకా రావలసి ఉంది! కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఈ ఒత్తిడి భరించలేక అనేక బ్యాంకులు గ్రామీణ ప్రజలకి కూడా రూపే కార్డులను పల్లీలు పంచినట్లు పంచాయి. 

అయితే ఇవన్నీ నెల రోజుల క్రిందటి మాట. ఇప్పుడు ఏపి, తెరాస సర్కార్ లతో సహా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, చివరికి కేంద్రప్రభుత్వం కూడా ఆ ఊసే ఎత్తడం లేదు. మార్కెట్లోకి మళ్ళీ సరిపడినంత నగదు వచ్చేయడంతో ఇప్పుడు ప్రజలు కూడా డెబిట్, క్రెడిట్, రూపే కార్డులను ఉపయోగించి సరుకులు కొనడానికి ఇష్టపడటం లేదు. దుఖాణదారులు కూడా అదే కోరుకొంటున్నారు కనుక తమ వద్ద ఉన్న స్వైపింగ్ పింగ్ మెషిన్లను మూలనపడేశారు. 

భారత్ వంటి దేశంలో ఆర్ధిక వ్యవస్థ నగదు రహిత లావాదేవీలకు మారడం రాత్రికి రాత్రి సాధ్యం కాదని మొదటి నుంచి అందరూ చెపుతూనే ఉన్నారు. ఒక 5-10 ఏళ్ళ సుదీర్గ కాలంలో అందుకు అనుగుణంగా ప్రజలలో, వివిధ వ్యవస్థలలో అవసరమైన మార్పులు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండి ఉంటే సాధ్యమయ్యేదేమో. కానీ కేంద్రప్రభుత్వం, దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆరంభశూరత్వం ప్రదర్శించి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. బహుశః మళ్ళీ అటువంటి ఆర్ధిక సంక్షోభం వచ్చినప్పుడు మేల్కని హడావుడి చేస్తాయేమో?


Related Post