స్వేచ్చా ప్రపంచంలో పదునైన 'విమర్శనాస్త్రం'..!

January 10, 2017


img

ప్రపంచంలో ఎవరు ఎవరి గురించైనా ఏమైనా అనొచ్చు.. అనే హక్కు ఉందని అంటుంటారు... దానికే పద్ధతిగా విమర్శ అని పేరు ఒకటి పెట్టేశారు. కాని ఇప్పుడు విమర్శ అనే అస్త్రం పక్కదారి పడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల పట్ల కూడా విమర్శనాస్త్రాలు సంధించడం ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి. సంఘంలో సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తులు వారు మాట్లాడే మాటలు వారి అభిప్రాయాలే అయినా వాటికి సంబందించిన బేధాభిప్రాయాలు ముందే ఊహించుకోవాలి.       

ప్రతిభకు తగ్గ ప్రతిఫలం చూపనప్పుడు దాన్ని అదునుగా తీసుకుని అతన్ని చాలెంజ్ చేసే అస్త్రం విమర్శ. అసలైన విమర్శ నిన్ను శక్తివంతున్ని చేస్తుంది అని అంటుంటారు. అయితే ఇప్పుడు మాత్రం విమర్శ అడ్డదారి పడుతుందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా వచ్చాక ఈ విమర్శనాస్త్రాలు ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. ఓ వ్యక్తి యొక్క ఇమేజ్ ను ఏమాత్రం ఆలోచించకుండా ఆ నిమిషం ఏం తడితే అది ట్వీట్ చేయడమో లేదా మెసేజ్ చేయడమో అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించాలి.      

విమర్శ అనేది స్వేచ్చే కాని ఆ విమర్శ కోసం మాట్లాడే మాటలు అనవసరపు ఆంధోళనలు కలుగచేసేలా ఉంటే మాత్రం అది అనవసరపు చర్చే అవుతుంది. సంఘంలో ఇమేజ్ ఉన్న వారు ఇలా తమ అభిప్రాయాలతో గొడవలు పడితే అది ఎవరికి మంచిది కాదు. అర్ధాలు మారుతున్న విమర్శకు సరైన విమర్శ ఇది అని అర్ధం చెప్పేలా మాట్లాడుతారో లేక ఎవరేం చెప్పినా సరే ఇష్టం వచ్చినట్టు విమర్శ చేసే హక్కు మాకుంది అని రెచ్చిపోతారో వారి విచక్షణకే వదిలేయాలి.               



Related Post