రామ్మోహన్ సామాన్యుడు కాడు

December 23, 2016


img

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించబడిన రామ్మోహన్ రావు, ఆయన బందువులు, ఇళ్ళు, కార్యాలయాలపై జరుగుతున్న ఆదాయపన్ను శాఖా దాడులలో చాలా బారీగా నగదు, 5 కేజీల బంగారం పట్టుబడింది. దానిలో రూ.30 లక్షలు విలువగల కొత్త నోట్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. రామ్మోహన్ కొడుకు వివేక్ ఇంటి నుంచి కూడా ఆదాయపన్ను శాఖా అధికారులు లెక్క చూపని ఆదాయం క్రింద రూ.5 కోట్లు స్వాధీనం చేసుకొన్నట్లు తెలుస్తోంది.

అతను తన తండ్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే విదేశాలలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి రాష్ట్రంలో 5 సంస్థలలో చాల బారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థలకు ప్రయోజనాలు కలిగే విధంగా రామ్మోహన్ రావు నిర్ణయాలు తీసుకొనేవారని వార్తలు వచ్చాయి. ఆదాయపన్ను శాఖా అధికారులు ఈ నెల 9న మాజీ తితిదే సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఆయన భాగస్వాముల ఇళ్ళపై దాడులు చేసినప్పుడు, అక్కడ వారికి రామ్మోహన్ రావు, వివేక్ లు సుమారు రూ.16-17 కోట్లు ముట్టినట్లు సంతకాలు చేసిన రశీదులు దొరికాయి. వాటి ఆధారంగానే ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఐటి అధికారులు రామ్మోహన్ రావు, వివేక్ ఇద్దరి వాంగ్మూలాలను రికార్డు చేశారు.వారిరువురిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

ఐటి దాడులలో పట్టుబడిన శేఖర్ రెడ్డికి న్యాయస్థానం వచ్చే నెల 6వరకు రిమాండ్ విదించింది. అయన బెయిల్ కోసం పెట్టుకొన్న పిటిషన్ పై ఈరోజు విచారణ జరుగబోతోంది.

శేఖర్ రెడ్డి ఎంత పెద్ద తిరునామం పెట్టుకొని భక్తుడులాగ వేషం వేసినప్పటికీ అతను లాభార్జన కోసమే కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. కనుక అవినీతికి, అక్రమార్జనకు అలవాటుపడటంలో విశేషం లేదు. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తరువాత అంత బాధ్యత, అధికారాలు కలిగి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడవలసిన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రామ్మోహన్ రావే ఈవిధంగా అవినీతికి పాల్పడటం విస్మయం కలిగిస్తుంది. అదెలాగుంది అంటే కంచే చేను మేసినట్లుంది. 


Related Post