తెలంగాణాలో తెదేపాకి పూర్వ వైభవం సాధ్యమేనా?

October 17, 2016


img

తెలంగాణా ఉద్యమాలు చాలా జోరుగా సాగుతున్న సమయంలో కూడా తెదేపా వాటిని తట్టుకొని బలంగా నిలబడగలిగింది కానీ రాష్ట్ర విభజన తరువాత అందరికీ తెలిసిన అనేక కారణాల చేత క్రమంగా బలహీనపడింది. దానిని బలోపేతం చేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినప్పట్టికీ బలమైన నాయకత్వం లేకపోవడం, రెండేళ్ళలోనే రాష్ట్రంలో తెరాస బాగా పాతుకుపోవడంతో తెదేపా భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. 

ఇటువంటి సమయంలో జిల్లాల పునర్విభజన కారణంగా కూడా తెదేపా నేతలు మరికొంత నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ దానినే తమకి అనుకూలంగా మార్చుకొని పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవాలని తెదేపా నేతలు భావిస్తున్నారు. ముందుగా, కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాలకి కమిటీలని, కన్వీనర్లని నియమించడం ద్వారా కొత్తగా అనేకమందికి పదవులు ఇచ్చి, వారి ద్వారా మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవాలని నిశ్చయించుకొన్నారు. అలాగే నవంబర్ 1వ తేదీ నుండి తెలంగాణాలో సభ్యత్వ నమోదు ప్రక్రియని ప్రారంభించాలని నిర్ణయించుకొన్నారు. తద్వారా గ్రామ స్థాయి నుంచి పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకోవాలని భావిస్తున్నారు. కానీ తెలంగాణా విభజన తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణంలో ఆంధ్రాకి చెందిన చంద్రబాబు అధ్యక్షుడుగా కలిగిన తెదేపాని అక్కడి ప్రజలు ఆదరిస్తారా? అంటే అనుమానమే.


Related Post