మంచి కథే కాని..!

September 20, 2016


img

సమీకరణాలు మారుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో ఇన్నాళ్లు కమర్షియాలిటీ కోసం తన్నుకున్న హీరోలంతా ఇప్పుడు సరైన కథా వస్తువు కోసం వెతకడం మొదలు పెట్టారు. సినిమా అంటే కేవలం ఫ్యాన్స్ ను ఉత్తేజపరచడమే కాదు వారికి ఎంతో కొంత తమ ద్వారా మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటి సినిమాలు కనబడుతున్నాయి. ఇది తప్పకుండా మెచ్చుకోదగ్గ విషయమే. అయితే కథ మంచిదే కాని దానికి సరైన కథనం లోపిస్తున్నట్టు నేటి సినిమాల పరిస్థితి కనబడుతుంది. 


ఓ రచయిత దర్శకుడి ఆలోచన.. ఓ మంచి కథ వస్తే దానికి లేని పోని సోకులు అద్దకుండా ఉన్న కథను ఉన్నట్టుగా ఇంకా తీయలేని పరిస్థితుల్లో ఉన్నారు దర్శక నిర్మాతలు. అయితే దీనికి స్టార్ హీరోల ఇమేజ్ తాలుఖా నీలు నీడలు వెంటపడుతున్నా వాటిని చీల్చుకుని సినిమాలను తీయాలి. అంటే కథ దానికి అవసరమైన స్కోప్ అంతే తప్పించి లేనిపోని హంగు ఆర్భాటాలు చేస్తే ఆడియెన్ సినిమా మీద అంచనాలను పెంచుకుని వచ్చే అవకాశం ఉంది. 


ఇప్పుడున్న స్టార్ హీరోల ఆలోచన విధానంలో కూడా చాలా మార్పులొచ్చాయి. వారు చేసే సినిమాలు ఏదో చేశాం అన్నట్టు కాకుండా తాము అనుభవించి ఆ అనుభవసారాన్ని సినిమాలో పండించేస్తున్నారు. మంచి సినిమా అంతే ప్రేక్షకుడి నచ్చిన సినిమా. అయితే అది కచ్చితంగా ఇలాంటి సినిమానే అనే కొలమానాలేమి లేవు కాని తప్పకుండా కథ అనే అస్త్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తే కచ్చితంగా ఆదరిస్తారు వారు కూడా.


అంతేకాదు ఆడియెన్స్ లో కూడా కొత్తరకం సినిమాలనే చూడాలనే ఆర్భాటం మొదలైంది. మూస థోరణి సినిమాలకు కాలం చెల్లిందని వారే చెప్పేస్తున్నారు. అందుకే దర్శక నిర్మాతలు ఇప్పుడు తమ క్రియేటివిటీ మీద పడ్డారు. మంచి కథ ఎలా చెప్పినా ఏ కోణంలో చెప్పినా ఆదరించడానికి ప్రేక్షకుడు ఎప్పుడు ముందుటాడు. అయితే ఆ కథకు స్టార్ హీరో అయినా అతని ఇమేజ్ కోసం కథను పాడు చేయకుండా కథలోనే హీరో ఇవాల్వ్ అయ్యేలా చేస్తే అంతకుమించిన అద్భుతం మరోటి ఉండదు. 


ఇప్పుడిప్పుడే ప్రపంచ స్థాయి మార్కెట్ కు ఎదుగుతున్న తెలుగు సినిమాలు మరిన్ని విజయాలతో ఇంకా గొప్ప చరిత్ర సాధించాలని.. రికార్డులు రివార్డులతో పాటుగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే సినిమాలు రావాలని ఆశిద్దాం.



Related Post