నేడు శ్రీకాంతాచారి 11వ వర్ధంతి

December 03, 2020


img

ఉదృతంగా సాగుతున్న మలిదశ తెలంగాణ ఉద్యమాలలో తన బలిదానంతో అగ్గిరాజేసిన అమరుడు కాసోజు శ్రీకాంతాచారి. తెలంగాణ కోసం ప్రజలు, రాజకీయ పార్టీలు ఎంతగా పోరాడుతున్నప్పటికీ అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం స్పందించకపోవడంతో 2009, డిసెంబర్‌ 3వ తేదీన శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ వద్ద ఒంటికి నిప్పు అంటించుకొని ‘జై తెలంగాణ... జై తెలంగాణ...’ అంటూ నినాదాలు చేస్తూ ఆత్మబలిదానం చేసుకొన్నాడు. మలిదశ తెలంగాణ ఉద్యమాలలో అదే తొలి బలిదానం. దాంతో కేంద్రం ఉలిక్కిపడింది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకోకుండా మళ్ళీ నిర్లిప్తతలో మునిగిపోయింది. శ్రీకాంతాచారి రగిలించిన తెలంగాణ జ్వాలల స్పూర్తితో ఆ తరువాత  సుమారు 1,400 మందికి పైగా యువతీయువకులు, విద్యార్దులు బలిదానాలు చేసుకొన్నారు. ఎట్టకేలకు 2014, జూన్‌ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సందర్భంగా యావత్ రాష్ట్ర ప్రజల తరపున మైతెలంగాణ.కామ్ నివాళులు అర్పిస్తోంది. 


Related Post