కొత్త సచివాలయం డిజైన్, నిర్మాణ పనులకు నేడు ఆమోదం

August 05, 2020


img

బుదవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కొత్త సచివాలయం డిజైన్, నిర్మాణ పనులపై మరోసారి చర్చించి ఆమోదం తెలుపనున్నారు. దీనికోసం గత వారం రోజులుగా సిఎం కేసీఆర్‌ వివిద శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యి చర్చించి ఆర్కిటెక్ట్ సంస్థ ఇచ్చిన సచివాలయం డిజైన్‌లో అవసరమైన మార్పులు చేర్పులు చేశారు. కనుక మంత్రివర్గ సమావేశంలో దానిపై చర్చ, ఆమోదం రెండూ లాంఛనప్రాయమేనని భావించవచ్చు. కొత్త సచివాలయం సుమారు రూ.450 కోట్లు అంచనా వ్యయంతో 4 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఎరియతో  విస్తీర్ణంలో నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనిలో ముఖ్యమంత్రి ఛాంబర్, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఆయా శాఖల సచివాలయ ఉద్యోగుల కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉంటాయి.   

ఇప్పటికే పాత సచివాలయం కూల్చివేత పనులు పూర్తవుతున్నాయి కనుక మంత్రివర్గ సమావేశంలో కొత్త సచివాలయం నిర్మాణ పనులకు ఆమోదం తెలుపగానే ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు ప్రారంబించబోతోంది. 


Related Post