సిపిఎస్ రద్దు, 50 శాతం ఫిట్ మెంట్ కోసం ఉద్యోగులు విన్నపాలు

May 08, 2024


img

తెలంగాణలో ప్రభుత్వోద్యోగుల వేతన సవరణలపై అధ్యయనం చేసి సిఫార్సు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శివశంకర్‌ని పీఆర్‌సీ ఛైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉద్యోగుల పిఆర్‌టియూటీఎస్‌ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, పలువురు ప్రతినిధులు ఆయనను కలిసి వేతన సవరణపై వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగ సంఘం నేతలు ఏమి అడుగుతున్నారంటే... 

• సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుచేయాలి. దీనిని డీఎస్సీ ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయాలి. 

• నానాటికీ పెరుగుతున్న ధరలు, చార్జీలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు 50 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయాలి. 

• ఉద్యోగుల పదవీ కాలంలో ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి ఆటోమేటిక్ ప్రమోషన్స్, వాటికి 15, 17,24 శాతం శ్లాబులతో హెచ్ఆర్ఏ ఉండేలా సిఫార్సు చేయాలని కోరారు. 

• తెలంగాణలోని ఎయిడెడ్, మోడల్ పాఠశాలలు, అన్ని సొసైటీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి. 

• సెకండరీ గ్రేడ్ అధ్యాపకులకు 13వ వేతన గ్రెస్, 2017 టిఆర్‌టి అధ్యాపకులకు అదనంగా నాలుగు ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి. గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు ఎంఈవోలతో సమానంగా వేతన స్కేలు ఇవ్వాలి. 

• 50 సంవత్సరాలు పూర్తయిన వారికి డిపార్ట్మెంట్ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఒక ఎల్టీసీకి ఒకనెల వేతనంతోపాటు విమాన చార్జీలు కూడా ఇవ్వాలి. 

• నగదు రహిత ఆరోగ్య పధకాన్ని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తుండాలి.    



Related Post