నేడు పీవీ జయంతి...సిఎం కేసీఆర్‌ ఘన నివాళులు

June 28, 2020


img

నేడు దివంగత ప్రధాని పీవీ నరసింహహరావు శత జయంతి సందర్భంగా తెలంగాణ సిఎం కేసీఆర్‌, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలువురు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు వద్ద గల పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌, ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.



తెలంగాణకు చెందిన పీవీ ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని, దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉండగా ప్రధానిగా బాధ్యత చేపట్టిన పీవీ నరసింహారావు అత్యంత చాకచక్యంగా వాటినన్నిటినీ అధిగమించడమే కాకుండా పలు సంస్కరణలు అమలుచేసి దేశాన్ని ప్రగతిపదంలో నడిపించారని పొగిడారు. పీవీ తెలంగాణకు గర్వకారణమని సిఎం కేసీఆర్‌ అన్నారు.

పీవీ గొప్పదనం రాష్ట్రప్రజలందరికీ కూడా తెలియజేసేందుకుగాను తెలంగాణ ప్రభుత్వం ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. వాటి కోసం ప్రత్యేకంగా ఒక లోగోను రూపొందించింది.



Related Post