వైద్యులకు కరోనా... ఎలా?

June 04, 2020


img

తెలంగాణ ప్రభుత్వం తగినన్ని కరోనా పరీక్షలు చేయించడం లేదని, ఆసుపత్రులలో వైద్యులు, వైద్యసిబ్బందికి పీపీఈ కిట్లను అందించలేకపోతోందని హైకోర్టులో 7 ప్రజాప్రయోజన పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరుగుతుండగానే ఉస్మానియా వైద్యకళాశాలలో మెడికోలకు, నీమ్స్ ఆసుపత్రిలో వైద్యులకు కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది. ఆ పిటిషన్లపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వైద్యులకు కరోనా సోకడంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. ఇదివరకు ఇదే కేసు విచారణ జరిగినప్పుడు పీపీఈ కిట్లు అవసరానికి మించే నిలువ ఉన్నాయని ప్రభుత్వం చెప్పిందని, మరి అటువంటప్పుడు ఇంతమంది వైద్యులకు, సిబ్బందికి ఏవిధంగా కరోనా వైరస్‌ సోకిందో చెప్పాలని నిలదీసింది. అసలు వారికి ఏవిధంగా ఎవరి ద్వారా కరోనా సోకిందనే విషయం ప్రభుత్వానికి తెలుసా లేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. వైద్యులకు, మెడికోలకు కరోనా సోకకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొంది?అయినప్పటికీ వారికి ఏవిధంగా సోకింది? మొత్తం ఎంతమందికి వ్యాపించింది? మొదలైన వియవరాలతో పూర్తి నివేదికను ఈ నెల 8న చేపట్టబోయే తదుపరి విచారణలో సమర్పించాల్సిందిగా హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


Related Post