ఏపీలో రోజుకు 9,000 కరోనా పరీక్షలు మరి తెలంగాణలో?

May 27, 2020


img

కరోనా పరీక్షల విషయంలో పొరుగు రాష్ట్రం ఏపీ తెలంగాణ కంటే చాలా పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. ఏపీలో రోజుకు సగటున 9,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలో కరోనా రోగుల విషయంలో పూర్తి స్పష్టత కనిపిస్తోంది. కానీ తెలంగాణలో రోజుకు ఎంతమందికి పరీక్షలు జరుపుతున్నారనే దానిపై ఎవరూ నోరు విప్పకపోవడం... గట్టిగా అడిగితే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించిన సంగతి తెలిసిందే. 

ఏపీలో గడిచిన 24 గంటలలో 9,664 మందికి పరీక్షలు జరుపగా వారిలో 68 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,787 మందికి కరోనా వైరస్‌ సోకింది. వారిలో 1,913 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా మరో 816 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 58 మంది కరోనాతో మరణించారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలియజేసింది.



Related Post