సింగరేణిలో సమ్మె సైరన్!

April 02, 2020


img

కరోనాతో రాష్ట్రం అల్లకల్లోలంమవుతుంటే సింగరేణి కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అందుకు వారు పేర్కొన్న కారణాలు మాత్రం సహేతుకంగానే ఉన్నాయి. సింగరేణి కార్మికుల తరపున సింగరేణి యాజమాన్యం ఒక్కరోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ ముందుగా సింగరేణి కార్మికులకు తెలియజేసి వారి అనుమతి తీసుకోకపోవడంతో వారు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశమంతా లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ తాము రోజూ విధులు నిర్వహిస్తూ దేశంలో బొగ్గు కొరత లేకుండా చూస్తుంటే అందుకు ప్రశంసించకపోగా సింగరేణి యాజమాన్యం ఏకపక్షంగా 50 శాతం జీతాలు మాత్రమే ఇస్తూ లే ఆఫ్ ప్రకటించడాన్ని సింగరేణి కార్మికులు తప్పు పడుతున్నారు.

ఉద్యోగులకు చెల్లించేందుకు రాష్ట్ర ఖజానాలో తగినంత డబ్బు లేకపోతే దాంతో సింగరేణి సంస్థకు ఎటువంటి సంబందమూ లేదు. ఎందుకంటే సింగరేణి గనులలో కార్మికులు రోజూ తవ్వితీస్తున్న బొగ్గును అమ్ముకోవడం ద్వారా సంస్థకు ఆదాయం వస్తోంది. దానిలో నుంచే కార్మికులకు జీతాలు చెల్లిస్తోంది తప్ప రాష్ట్ర ఖజానా నుంచి కాదు. కనుక సింగరేణి కార్మికుల జీతాలలో 50 శాతం కోత విదించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారమూ లేదు. కనుక ‘లే ఆఫ్’ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోకపోతే ఈనెల 15 నుంచి సమ్మె చేపడతామని తెలియజేస్తూ సింగరేణి యాజమాన్యానికి గురువారం ఉదయం నోటీసు ఇచ్చారు. కావాలంటే తమకు పూర్తి జీతాలు చెల్లిస్తూ బొగ్గుగనులలో కూడా లాక్‌డౌన్‌ అమలుచేసుకోవచ్చునని వారు సూచించారు. 


Related Post