కరోనా కష్టాలకు ప్యాకేజ్‌తో ఉపశమనం

March 26, 2020


img

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి 3వారాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రోజువారీ కూలీలు, వలస కార్మికులు, రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు అష్టకష్టాలు పడుతున్నారు. వారికోసం కేంద్రప్రభుత్వం ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పేరిట ఓ భారీ ప్యాకేజ్ ప్రకటించింది. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ కొద్ది సేపటి క్రితం డిల్లీలో ఈ ప్యాకేజీ వివరాలను ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో పేదప్రజాలెవరూ ఆకలితో ఉండకూడదనే ప్రధాని నరేంద్రమోడీ ఆలోచనతో ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నామని వారు తెలిపారు.  

1. మొత్తం ప్యాకేజీ విలువ: రూ. 1,70,000 కోట్లు.

2. దీనివలన లబ్దిపొందేవారి సంఖ్య: 80 కోట్లు 

3. ప్రతీ లబ్దిదారుడికి నేటి నుంచి 3 నెలల వరకు 5కేజీల బియ్యం లేదా గోదుమలు, ఒక కేజీ పప్పు ఇస్తారు. 

4. జన్ ధన్ అకౌంట్లు కలిగిన మహిళలకు వారి ఖాతాలో నెలకు రూ.500 చొప్పున మూడు నెలలు జమా చేయబడుతుంది. దీని వలన 20.5 మహిళలకు లబ్ది పొందుతారు.  

5. వృద్ధులు, నిరుపేదలు, వికలాంగులకు నెలకు రూ.500 చొప్పున రెండు నెలలలో రూ.1,000 అందించబడుతుంది.

6. కరోనా రోజులకు సేవలు అందిస్తున్న వైద్యులకు, నర్సులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ఆశావర్కర్లుకు 3 నెలలవరకు అమలులో ఉండేవిధంగా రూ.50 లక్షలు జీవితభీమా చేయబడుతుంది. దీనివలన్ మొత్తం 20 లక్షల మంది లభిపొండనున్నారు. 

7. రోజువారీ కూలీలకు దినసరి కూలీని రూ.182 నుంచి రూ.220 కిపెంచినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివలన దేశంలో 5 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది.  

8. సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వచ్చే మూడు నెలలపాటు కేంద్రప్రభుత్వమే వారి ఈపీఎఫ్ సొమ్ము చెల్లిస్తుంది. కానీ 100 మంది ఉద్యోగులున్న సంస్థలో 90 శాతం మందికి నెలకు కనీసం రూ.15,000 జీతం చెల్లిస్తున్న సంస్థలకే ఇది వర్తిస్తుంది. 


Related Post