రిజర్వేషన్ల రద్దు గురించి అమిత్ షా ఏమన్నారంటే...

May 10, 2024


img

కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తుందని సిఎం రేవంత్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలందరూ ఎన్నికల ప్రచారంలో పదేపదే ఆరోపిస్తున్నారు. గురువారం భువనగిరిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ అంశంపై ప్రజలకు స్పష్టత ఇచ్చారు. 

భువనగిరి నుంచి  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బూర నర్సయ్యగౌడ్ తరపున ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న అమిత్ షా, “రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో బిఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మజ్లీస్‌ పార్టీ నేతలను బుజ్జగించేందుకు, కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో 4 శాతం కోత విధించి, ముస్లింలకు కేటాయించారు. మేము దానినే రద్దు చేసి మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామని చెపుతున్నాము. తప్ప మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పలేదు. 

మేము 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నాము. కానీ ఏనాడూ రిజర్వేషన్స్ రద్దు చేయాలనే ఆలోచన చేయలేదు. ఇక ముందు కూడా చేయబోము. మతం ఆధారంగా రిజర్వేషన్స్‌కు మేము మొదటి నుంచి వ్యతిరేకమే. ఇప్పుడూ దానికే మేము కట్టుబడి ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెపుతున్నాము,” అని అమిత్ షా చెప్పారు. 


Related Post