మార్చి 31 నుంచి ఆ హామీ అమలు: కేసీఆర్‌

January 25, 2020


img

అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను మళ్ళీ గెలిపిస్తే 57 ఏళ్ళు వయసున్న వారందరికీ నెలకు రూ.1,000 చొప్పున వృద్ధాప్య పింఛను ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ హామీని అమలుచేయకపోవడంతో ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తున్నాయి. ఇవాళ్ళ తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో సిఎం కేసీఆర్‌ స్వయంగా ఆ హామీ గురించి ప్రస్తావించి మార్చి 31వ తేదీ నుండి దానిని అమలుచేస్తామని చెప్పారు. ఇప్పటివరకు 65 ఏళ్ళు ఆ పైన వయసున్నవారు మాత్రమే వృద్ధాప్యపింఛనుకు అర్హులుగా ప్రభుత్వం పరిగణించేది. కానీ మార్చి 31 నుంచి 57 ఏళ్ళు వయసున్నవారందరినీ అర్హులుగా పరిగణించి వృద్ధాప్యపింఛను అందజేస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వోద్యోగుల వయోపరిమితి కూడా పెంచుతామని చెప్పారు. పీఆర్సీ పెంపుపై త్వరలోనే చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు.  



Related Post