కాళేశ్వరంపై వారి వైఖరి ఏమిటో ?

August 31, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మద్య జరుగుతున్న వాదోపవాదాలు అందరూ వింటూనే ఉన్నారు. తెలంగాణకు జీవనాడివంటిదని తెరాస వాదిస్తుంటే, దాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేసిన అప్పులు, వాటిపై వడ్డీలు, నిర్వహణ వ్యయం, విద్యుత్ బిల్లులతో తెలంగాణ ప్రజలపై శాస్వితభారం మోపారని ప్రతిపక్షాల వాదిస్తున్నాయి. దీనిపై ఎవరి వాదనలు వారు వినిపిస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాల మరో ఆరోపణ...కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని. దానికీ తెరాస నేతలు ధీటుగానే జవాబిచ్చారు. దమ్ముంటే సిబిఐ చేత దర్యాప్తు చేయించుకోవాలంటూ సవాలు విసిరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వలన రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం లేదు... పర్యాటక ఆకర్షకేంద్రంగా మాత్రమే పనికి వస్తుందని ఎద్దేవా చేస్తున్న కాంగ్రెస్‌ నేతలే, దానికి తెరాస సర్కార్‌ జాతీయహోదా సాధించడంలో విఫలం అయ్యిందని లేదా అందుకు గట్టిగా ప్రయత్నించడంలేదని విమర్శిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఏవిధంగానూ ఉపయోగపడదని ప్రతిపక్షాలు భావిస్తున్నప్పుడు మళ్ళీ దానికి జాతీయహోదా సాధించలేదని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గట్టిగా నమ్ముతున్నప్పుడు న్యాయస్థానాన్నో లేదా కేంద్రాన్నో ఆశ్రయించి విచారణ జరిపించుకోమని తెరాస సర్కార్‌ స్వయంగా చెపుతుంటే ఎందుకు వెనకాడుతున్నారు? అంటే వారికి కాళేశ్వరం ప్రాజెక్టుపై సరైన అవగాహన లేకనే ఈవిధంగా మాట్లాడుతున్నారా లేక తెరాస సర్కార్‌పై బురద జల్లెందుకే వారు ఇటువంటి ద్వందవైఖరితో వ్యవహరిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. 


Related Post