గుత్తాకు మంత్రిపదవి లభిస్తుందా?

August 26, 2019


img

ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి చేత మండలి డెప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తెరాస ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎంపీగా పనిచేసిన గుత్తాకు లోక్‌సభ ఎన్నికలలో అవకాశం లభించకపోవడం వలన ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ఊహించినదే. అయితే ఎంపీగా చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీగా చేయవలసిరావడం ఒక మెట్టు దిగినట్లే అవుతుంది. కనుక ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునేందుకే సిఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారా? లేక ఆయనను సంతృప్తిపరిచేందుకే ఎమ్మెల్సీగా చేశారా? అనేది రానున్న రోజులలో తెలుస్తుంది. Related Post