తెలీకపోతే కవితమ్మను అడిగితే చెపుతారు కదా?

August 21, 2019


img

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి బుదవారం ఉదయం సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న అవుట్ పేషెంట్ బ్లాక్‌కు శంఖుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ లక్ష్యం మున్సిపల్ ఎన్నికలు కాదు. 2023లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. అయితే మున్సిపల్ ఎన్నికలలో కూడా తెరాసకు గట్టి పోటీ నిస్తాము. తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జెపి నడ్డా అంటే ఎవరో తెలియదనడం అహంభావమే. ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్‌తో సహా తెరాస ఎంపీలు అనేకసార్లు ఆయనను కలిసిన సంగతి అందరికీ తెలుసు. కనుక రాజకీయాలలో ఉన్నవారు అహంభావం ప్రదర్శించడం సరికాదు. రాష్ట్రంలో బిజెపి ఎక్కడుంది అని కేటీఆర్‌ అడిగినట్లు విన్నాను. తన సోదరి కవితమ్మను అడిగితే ఆమె సమాధానం చెపుతారు కదా?. లోక్‌సభ ఎన్నికలలో కారు...సారు.. పదహారు.. డిల్లీ సర్కారు అంటూ ప్రగల్భాలు పలికిన తెరాస నేతలకు 7 స్థానాలలో ఓడిపోవడంతో షాక్ అయ్యారు. వారు ఇంకా ఆ షాక్ నుంచి తెరుకున్నట్లు లేదు. అందుకే నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారు,” అని అన్నారు. 


Related Post