ఉప్పల్‌లో శిల్పారామం ప్రారంభం

June 22, 2019


img

నగరంలోని శిల్పారామంకు లభిస్తున్న ప్రజాధారణ, కళాకారులకు కలుగుతున మేలు దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ హైదరాబాద్‌ ఉప్పల్‌లో మరొక శిల్పారామం ఏర్పాటు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం దానిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కేటీఆర్‌ చొరవ కారణంగానే ఇక్కడ ఈ శిల్పారామం ఏర్పడింది. దీనివలన ప్రజలకు వినోదం, కళాకారులకు వారి కళలను ప్రదర్శించే అవకాశం కలుగుతుంది. శిల్పారామంకు లభిస్తున్న ప్రజాధారణ చూస్తున్నప్పుడు రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందనిపిస్తోంది,” అని అన్నారు. Related Post