త్వరలో ఎమ్మెల్యేలకు కొత్త క్వార్టర్స్ కేటాయింపులు

June 17, 2019


img

రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ్యుల కోసం హైదర్‌గూడలో నిర్మించిన భవన సముదాయాలను సిఎం కేసీఆర్‌ ఈరోజు ఉదయం ప్రారంభోత్సవం చేశారు. ఒక్కోటి 12 అంతస్తులతో ఉండే ఈ భావన సముదాయ నిర్మాణానికి రూ.166 కోట్లు ఖర్చయింది. నామినేటడ్ ఎమ్మెల్యేతో సహా మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకు సరిపోయే విధంగా నిర్మించారు. వారి సిబ్బంది, అటెండర్ల కోసం కూడా ఇవే భవనాలలో ప్రత్యేకంగా ఫ్లాట్లు నిర్మించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ క్వార్టర్స్‌‌లో ఒక్కో ఎమ్మెల్యేకు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్‌ను కేటాయించారు. ఈ భవన సముదాయంలోనే సూపర్ మార్కెట్, ఇండోర్ గేమ్స్, క్యాంటీన్, స్టోర్ రూమ్, హెల్త్ సెంటర్, క్లబ్ హౌస్ వగైరా ఆధునిక సదుపాయాలన్నీ కల్పించారు. కరీంనగర్‌ పార్కింగ్ కోసం సెల్లారులో మూడు అంతస్తులు నిర్మించారు. దానిలో 276 కార్లను పార్కింగ్ చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలు తమను కలిసేందుకు వచ్చిన వారితో సమావేశం అయ్యేందుకు సమావేశమందిరాలు ఏర్పాటు చేశారు. మురుగునీరు శుద్ధి చేసే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే ఎమ్మెల్యేలకు ఫ్లాట్ల కేటాయింపులు చేస్తారు. 


Related Post