ఇక సర్వేలు చేయను: లగడపాటి

May 24, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై లగడపాటి చెప్పిన జోస్యం ఫలించకపోవడంతో ఇకపై సర్వేల జోలికి వెళ్లబోనని లిఖితపూర్వకంగా ప్రకటించారు. తన సర్వేల వలన ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించవలసిందిగా కోరారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి గెలుస్తుందని చేప్ప్గా వైసీపీ గెలిచింది. కేంద్రంలో హంగ్ ఏర్పడుతుందని చెప్పగా బిజెపి సొంతంగా 303 సీట్లు గెలుచుకొని ఎన్డీయే మిత్రపక్షాల మద్దతు కూడా అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఆయన నిష్పక్షపాతంగా సర్వే చేయించి ఉంటే అవి వాస్తవ ఫలితాలకు ఎంతో కొంత దగ్గరగా ఉండేవి కానీ రాజకీయ దురుదేశ్యంతో లేదా రాజకీయ పక్షపాతంతో సర్వేల పేరిట ప్రజలను తప్పు ద్రోవ పట్టించబోయి ఆయనే చివరికి నవ్వులపాలయ్యారు. Related Post