ఎమ్మెల్సీ ఎన్నికలు రేపే...తెరాసకు పోటీ లేదు కానీ...

March 11, 2019


img

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు మంగళవారం జరుగబోతున్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు తెరాసలో చేరేందుకు సిద్దపడటంతో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఒక్క అభ్యర్ధి గూడూరు నారాయణ రెడ్డిని గెలిపించుకోలేని స్థితిలో ఎన్నికలను బహిష్కరించింది. కానీ కాంగ్రెస్‌ అభ్యర్ధి తన నామినేషన్ ఉపసంహరించుకొనే అవకాశం లేదు కనుక మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికలు  అనివార్యం అయ్యాయి. 

ఎన్నికలలో తెరాసకు పోటీ లేనప్పటికీ ఎమ్మెల్యేలను కాస్త తికమకపెట్టే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ గురించి వారికి అవగాహన కల్పించేందుకు సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సోమవారం సాయంత్రం తెరాస శాసనసభాపక్షం సమావేశం అయ్యింది. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకు దానిలో ‘మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశంలోనే 16 లోక్‌సభ స్థానాలు గెలుచుకొనేందుకు ఎమ్మెల్యేలకు సిఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేసారు. సిఎం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారసభలలో పాల్గొనబోతున్నారు. వాటి ఏర్పాట్లపై నేటి సమావేశంలో చర్చించి షెడ్యూల్ ఖరారు చేయవచ్చు.


Related Post