ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తా: ఆర్.కృష్ణయ్య

October 22, 2018


img

బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య ఒక ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో “టిడిపి  మహాకూటమికి అందజేసిన అభ్యర్ధుల జాబితాలో నాపేరు, నా నియోజకవర్గం లేకపోవడం నాకు విస్మయం కలిగించినా దానిని వారి విజ్నతకే విడిచిపెడుతున్నాను. అయితే నేను గత ఎన్నికలలో ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన తరువాత, దాని అభివృద్ధికి చాలా కృషి చేసినందున, నియోజకవర్గం ప్రజలందరూ మళ్ళీ నన్ను అక్కడి నుంచే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. బీసీ సంఘాలు కూడా నేను అక్కడి నుంచే పోటీ చేయాలని కోరుతున్నాయి. కనుక ఈసారి కూడా నేను ఎల్బీ నగర్ నుంచే పోటీ చేయాలనుకొంటున్నాను. మహాకూటమిలో పార్టీలు టికెట్ల కేటాయింపులు పూర్తి చేసిన తరువాత నేను నా భవిష్య కార్యాచరణను ప్రకటిస్తాను,” అని అన్నారు.

మహాకూటమిలో బీసీలకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య కోరుతున్నారు. అయితే ఆయన చెప్పిన ఈ మాటలను బట్టి మహాకూటమిలో ఏదో ఓ పార్టీ తరపున ఎల్బీ నగర్ నుంచి టికెట్ ఖాయం చేసుకోవడానికే ఆయన ప్రయత్నిస్తున్నట్లున్నారనిపిస్తోంది. బీసీలకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయని వాదిస్తున్న కృష్ణయ్య కూడా తన స్వార్ధం తాను చూసుకొంటున్నారా?అనే సందేహం కలుగుతోంది. 


Related Post