బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాకపోతే... కోదండరాం

June 16, 2018


img

కేంద్రప్రభుత్వం విభజన చట్టంలో హామీలను ఒకటొకటిగా పక్కన పెడుతుంటే కేంద్రాన్ని గట్టిగా నిలదీయకుండా తెలంగాణా ప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తోందని తెలంగాణా జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు మాట తప్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం వద్ద ఉక్కు కర్మాగారం నెలకొల్పడం సాధ్యం కాదనుకుంటే కనీసం అక్కడ ముడి ఇనుము శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పినట్లయితే స్థానికులకు బారీగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయం వ్యక్తం చేశారు. ముడి ఇనుమును ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవడం కంటే బయ్యారంలో ముడి ఇనుము శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పితే మంచిదని అన్నారు. విభజన చట్టంలో హామీలను అన్నిటినీ అమలు చేసేవరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తేవాలని ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. 



Related Post