హమ్మయ్య! అందరూ బస్సెక్కుతున్నారు

February 17, 2018


img

అనేక తర్జనబర్జనల తరువాత టి-కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి మొదట బస్సు యాత్ర, ఆ తరువాత ఒకరి తరువాత మరొకరు పాదయాత్రలు చేయడానికి నిర్ణయించారు. దీనికి అందరూ అంగీకరించడంతో శనివారం బస్సు, పాదయత్రాల్ షెడ్యూల్ టి-కాంగ్రెస్ ప్రకటించింది. 

కాంగ్రెస్ పార్టీకి బాగా అచ్చొచ్చిన చేవెళ్ళ నుంచే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 26వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. మే 15వరకు సాగే బస్సు యాత్రలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో పర్యటిస్తారు. మొదట ఫిబ్రవరి 26 నుంచి మార్చి 11 వరకు బస్సు యాత్ర చేస్తారు. హోలీ సందర్భంగా మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు విరామం ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి మే 15వరకు రెండవ విడత బస్సు యాత్ర ఉంటుంది. ఆ తరువాత సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒకరి తరువాత మరొకరు మే నెలాఖరు వరకు పాదయాత్రలు చేస్తారు. జూన్ 1వ తేదీన వరంగల్ లేదా హైదరాబాద్ లో బారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. దానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతారు. ఆ సభలోనే ఎన్నికల శంఖారావం పూరించి, లోక్ సభ, శాసనసభలకు తమ అభ్యర్ధుల పేర్లను విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.


Related Post