దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. నేడు 92 విమానాలు రద్దు అయ్యాయి. దీంతో విమానాశ్రయాలలో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా విమానాలు రద్దు చేస్తుండటం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార పనులపై బయలుదేరినవారు, ఏమి చేయాలో పాలుపోక ఇండిగో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వందలాది ప్రయాణికులు ఆందోళన చేస్తూ ఇండిగో సిబ్బందిపై విరుచుకుపడ్డారు.
మిగిలిన నగరాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అత్యవసరంగా ఢిల్లీ, ముంబై వంటి దూర ప్రాంతాలకు వెళ్ళేందుకు విమానాలు తప్ప మరోదారి లేదు. కనుక మిగిలిన విమానయాన సంస్థలపై ఒత్తిడి పెరిగిపోయింది. అకస్మాత్తుగా ఒక్క ఇండిగో సంస్థకే ఈ సమస్య ఎందుకు వచ్చిందో, ఎప్పట్లో పరిష్కారం అవుతుందో చెప్పే నాధుడు తీరేలా కనిపించడం లేదు. ఓ పక్క ప్రయాణికుల ఒత్తిడి, తిట్లు, శాపానార్ధాలు తప్పడం లేదు. ఒకేసారి డజన్ల కొద్దీ విమానాలు రద్దు అవుతుండటంతో భారీగా నష్టమూ తప్పడం లేదు.