ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటి నుంచి దేశ ప్రజలు యుద్ధ వివరాలు తెలుసుకునేందుకు మీడియా, సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. దీనిని కూడా సైబర్ నేరగాళ్ళు ప్రజల డబ్బు దోచుకోవడానికి ఓ గొప్ప అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని, కనుక ఆపరేషన్ సింధూర్ లేటస్ట్ అప్‌డేట్స్ పేరుతో వచ్చే లింక్స్ ఓపెన్ చేయవద్దని తెలంగాణ పోలీస్ విజ్ఞప్తి చేశారు.
ఆ లింక్ ద్వారా కొన్ని ప్రమాదకరమైన మాల్ వేర్‌ని పంపించి, దాని సాయంతో ఫోన్లు, కంప్యూటర్లు హ్యాక్ చేసి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసేస్తారని పోలీసులు హెచ్చరించారు. కనుక సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారిక హ్యాండిల్స్ ద్వారానే సమాచారం తెలుసుకోవాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.