కెనడియన్ సిక్కులు, పాఠశాల పాఠ్య ప్రణాళికలో 1914 కొమగత సంఘటనను చేర్చవలసిందిగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడ్యూ ను డిమాండ్ చేశారు.
మలేషియాలో నివసించే సిక్కు బాబా గుర్దిత్ సింగ్ 1914 లో, జాత్యహంకార చట్టాలు సవాళ్లపై పోరాడడానికి, 376 భారతీయులను (అందులో ఎక్కువగా సిక్కులు) తీసుకురావడానికి, జపనీస్ నౌక కొమగత మేరు తీసుకున్నారు.
ఆ సమయంలో, భారతదేశం మరియు కెనడా బ్రిటిష్ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి భారతీయులు కెనడాలో ప్రవేసించే హక్కు కలిగి ఉండుండాలి. కానీ కెనడియన్ ప్రభుత్వం వివిధ చట్టాలను చూపిస్తూ దేశంలోకి భారతీయులు అడుగుపెట్టకుండా అడ్డుకుంది. మే 23, 1914 న వాంకోవర్ నౌకాశ్రయం లో ప్రవేశించిన కొమగత మేరు, బలవంతంగా రెండు నెలల తర్వాత భారతదేశం తిరిగి పంపబడింది. 1914 సెప్టెంబర్ లో కలకత్తాలో బడ్జె బడ్జె చేరుకున్నప్రయాణీకులు, పోలీసుల కాల్పులకు గురయ్యి, 19 మంది మరణించారు.
బుధవారం హౌస్ ఆఫ్ కామన్స్ లో ట్రుడ్యూ మాట్లాడుతూ, "కెనడా లోని నిరోధక చట్టాలు భారతీయులను బాగా బాధపెట్టాయి, అన్నిటికి కలిపి క్షమాపణలు కోరుతున్నాను. మేమెన్ని క్షమాపణలు చెప్పినా బాధను పూర్తిగా తుడిచేయలేము, అది మా దేశానికి ఒక మరక లాగే ఉంటుంది," మళ్ళీ అలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహిస్తామని అంటూ, ప్రధాని క్షమాపణలు కోరారు. ప్రజల కోరిక మేరకు 1914 కొమగత సంఘటనను స్కూల్ సిలబస్ లో చేరుస్తున్నట్లుగా ప్రకటించారు.